భూములిచ్చిన వారు సంతోషంగా లేరు
మహబూబ్నగర్,నవంబర్16(జనం సాక్షి ): జలాశయాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వ తీరుతో సంతోషంగా లేరని రైతు సమస్యల సాధన పోరాటసంఘం నేతలు అన్నారు. వివిధ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులు ఇటీవల తమ నిరసన తెలిపారు. జిల్లాలో కర్వెన జలాశయంతోపాటు పలు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులను లాభదాయకమైన పరిహారమే కాకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. నష్టపరిహారం కొందరికి మాత్రమే అందిందని, పూర్తిస్థాయిలో అందించలేదని పేర్కొన్నారు.