భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ ముందుకు

4

– హరీశ్‌ చర్చలు సఫలం

మెదక్‌,జులై 27(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ వ్యవహారం  మరో కీలకమలుపు తిరిగింది. ఓ వైపు విపక్షాలు ఆందోలనచేస్తుండగా పల్లెపహాడ్‌ గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో ముందగుడు వేసింది. ముంపు గ్రామాల్లో ఒకటైన పల్లెపహాడ్‌ గ్రామస్థులు మల్లన్నసాగర్‌కు భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు పల్లెపహాడ్‌ రైతులు సిద్ధమయ్యారు. రైతులు, యువకులతో మంత్రి హరీష్‌రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. గజ్వేల్‌ మల్లారెడ్డి గార్డెన్‌లో పల్లెపహాడ్‌ రైతులు, యువకులతో మంత్రి చర్చలు జరిపారు.  జరిపిన చర్చల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్‌ రొనాల్డ్‌ రాస్‌ పాల్గొన్నారు. తమ భూములు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని రైతులు ఒప్పుకున్నారు.  మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పల్లెపహాడ్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మంత్రి హరీష్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో భూములిచ్చేందుకు ఒప్పుకున్న పల్లెపహాడ్‌ వాసుల త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సహకరిస్తామని పల్లెపహాడ్‌ గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారని మంత్రి చెప్పారు. లక్షలాది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆరు గ్రామాలు ముందుకు వచ్చాయి. మిగతా గ్రామాలతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. అన్ని గ్రామాల ప్రజలను ఒప్పించి మల్లన్నసాగర్‌ నిర్మిస్తామని ఉద్ఘాటించారు. మంత్రి హావిూతో ప్రాజెక్టుకు భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ రైతులు అంగీకారం తెలిపారు.     అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పల్లెపహాడ్‌ వాసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ నమ్మకంతో స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొచ్చిన పల్లెపహాడ్‌ వాసుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు ఆరు గ్రామాలు ముందుకొచ్చాయని.. మిగతా గ్రామాలతోనూ చర్చించి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్నారు.