భూసారా పరీక్ష విధానాల గురుంచి వివరిస్తున్న శాస్త్రవేత్త ఏ కిరణ్
గరిడేపల్లి, జూలై 30 (జనం సాక్షి):కేవీకే గడ్డిపల్లిలో శనివారం షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక యువతకు జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారం సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ హైదరాబాద్ వారి సంయుక్త సహకారం తో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ లో భాగంగా 4 వ రోజు చేపల చెరువు నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక కోసం మట్టినామున సేకరణ భూసారా పరీక్ష విధానాల గురుంచి చేపల చెరువు నిర్మించుకోవడానికి స్థలం ఎంపిక మట్టి పరిశీలన ఎంతో ముఖ్యమైందని కే.వీ.కే మృత్తికా శాస్త్రవేత్త ఏ. కిరణ్ వివరించారు. అదేవిధంగా నల్ల రేగడి నేలలు బంక మట్టి కొద్దిగా ఇసుక తో కూడిన నల్ల రేగడి నేలలు అనువుగా వుంటాయని అన్నారు. చెరువు నిర్మాణానికి ముందుగానే మట్టి సేకరించి పరిశీలన చేసుకోవాలని భూసార పరీక్షలకు అనుగుణంగా చెరువుల్లో సేంద్రియ రసాయనిక ఎరువుల మోతాదును లెక్క కట్టి చెరువు లో నెలసరి మోతాదులో వాడుకోవాలని తద్వారా పోషకాలు సమృద్ధిగా అంది అధిక చేపల దిగుబడిని పొందవచ్చునని అన్నారు. ఈ శిక్షణలో భాగంగా మట్టి నమూనా సేకరణ విధానము గురుంచి వివరించి తదుపరి భూసారా ప్రయోగశాలలో మట్టి పరిశీలన గురించి ప్రాక్టికల్ గా చూపించి శిక్షణార్థులకు అవగాహన కల్పించినట్లు తెలియజేసారు.ఈ శిక్షణ లో కే. సందీప్, కే.నరేష్, సరస్వతి తదితరులు 30 మంది పాల్గొన్నారు.