భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌:  నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో చితులు పేర్చారు. తాము ఈ చితులలో సజీవదహనం అవుతామని హెచ్చరించారు..బుజ్‌బుజా,డోకారియా గ్రామాల లోని ప్రజలంతా తమ పొలాలలో ఇలా చితులు పేర్చారు..
తమను ఖాళీ చేయిస్తే వీటిలో అహుతి అయిపోతిమని హెచ్చారించారు. అని మధ్యప్రదేశ్‌ జనతాదళ్‌ యునటైడ్‌ పార్టీ అధ్యక్షుడు గోవింద్‌ యాదవ్‌ శుక్రవారం చెప్పారు. జెడియు జాతీయ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ కూడా కట్నికి వచ్చారని నేటి సాయంత్రం రైతులతో మాట్లడతారని చెప్పారు.రైతుల సభలో మాట్లడేందుకు జిల్లా యంత్రాంగం నిరాకరిస్తోంది. కాని శరద్‌ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని గోవింద్‌ చెప్పారు. ఈ సందర్బంగా ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు.  కట్ని జిల్లా బర్హీ తెహసీల్‌లో డబ్ల్యుఇఎంపిఎల్‌ కంపెనీ ఒక ఉష్ణ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తోంది.మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 2009లో నవంబర్‌ 4న ఆమేరకు ఆవగహన ఒప్పందం కుదుర్చుకుంది… ప్రభుత్వం భూమి 800 ఎకరాల ఇందుకు కేటాయించారు… మిగితా 600ల ఎకరాలు రైతులనుంచి సేకరిస్తారు. కాని తమకు ఇష్టం లేకుండా బలవంతంగా ప్రభుత్వం భూమి సేకరించటంతో రైతులు మండి పడుతున్నారు. సుమారు 350 ఎకరాల పచ్చని పంటపోలాలు కంపెనీకి పోతాయి. దాంతో వారు సర్వశక్తులను ఒడ్డి ఈ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. గతంలో జిల్లా యంత్రాంగం తమను ఖాళీ చేయించే ప్రయత్నలకు రైతులు అడ్డుపడ్డారు.. జిల్లా ఎస్‌పి రాజేష్‌ హింగాస్‌కర్‌ కూడా రైతులు చితులు పేర్చినవిషయాన్ని నిర్థారించారు…