భూ వివాదంలో మహిళ హత్య

నల్లగొండ,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెంలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన వీరమళ్లు లక్ష్మమ్మ(65) దారుణ హత్యకు గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దొండవారిగూడెంలో పోలీసులు భారీగా మోహరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.