భోజనాలు నివారణ కోసం కృషి చేయండి.. జిల్లా కలెక్టర్ గోపి..
జిల్లా సమన్వయ కమిటీ సమావేశం..
ఫోటో రైటర్ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
వరంగల్ బ్యూరో అక్టోబర్ 18 (జనం సాక్షి )
బోదకాలు నివారణ కోసం నిర్వహించే సామూహిక మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు.
మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహించే బోదకాలు వ్యాధి నివారణ కోసం ఎండిఏ (సామూహిక మాత్రాల పంపిణీ) కార్యక్రమం పై జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ ఈనెల 20న భోదకాలు వ్యాధి నివారణ కోసం నిర్వహించే ఎండిఏ (సామూహిక మాత్రల పంపిణీ) కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తద్వారా బోదకాలు వ్యాధి జిల్లాలో వ్యాప్తి చెందకుండా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం కు సంబంధించి మందులకు ఉపయోగించు బ్యాగులను రోగులకు అందజేయడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలోని సంగెం మరియు పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈనెల 20న ఎండిఏ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 67,000 జనాబా కు 246 టీం ల ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోదకాలు వ్యాధి వ్యాప్తి గురించి మరియు నివారణ చర్యల గురించి జిల్లా అధికారులకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ ఐ ప్రకాష్, డాక్టర్ గోపాలరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు డి ఆర్ డి ఓ ఎం సంపత్ రావు, డీఈఓ వాసంతి, జడ్పీ సీఈవో సాహితి, శారద, సంగెం, పైడిపల్లి వైద్యాధికారులు, డిడిఎం నితిన్, డెమో అనిల్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ మాడిశెట్టి శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ పాలకుర్తి సదానందం తదితరు ఉద్యోగులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|