భోధన సామర్ధ్యం పెంపొందించుకోవాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నల్గొండ బ్యూరో. జనం సాక్షి.. మౌలిక భాషా సామర్ధ్యాల సాధన తొలిమెట్టు శిక్షణా కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు శిక్షణా కార్యక్రమాలు ద్వారా తమ బోధనా సామర్త్యం మెరుగు పరుచు కావాలని,విద్యార్థులకు సులభంగా అర్థ మయ్యే విధంగా బోధన గావించాలని కలెక్టర్ అన్నారు. మౌలిక భాషా సామర్ధ్యాల సాధన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి రిసోర్స్ పర్సన్ లకు మంగళవారం జిల్లా స్థాయిలో మూడు రోజుల గవర్నమెంట్ డైట్ కళాశాల నల్గొండ నందు నందు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ యొక్క శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రధానమైనదిగా భావించి విజయవంతం చేయాల్సిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్ష పతి, రాష్ట్ర పరిశీలకులు సి.హెచ్ శేషు, ,డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మంగా రెడ్డి, నల్లగొండ జిల్లా సమగ్ర శిక్ష క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అర్ రామ చంద్రయ్య, విషయ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area