భౌతిక దాడులకు పాల్పడితే ప్రతిదాడులకు వెనకాడమని హెచ్చరిక

మత్యకార కులానికి చెందిన ఈటల రాజేందర్ పై మునుగోడులో అగ్ర వర్గాలు భౌతిక దాడులకు పాల్పడితే ప్రతిదాడులకు వెనకాడమని మత్య్సకార సహకార సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల అల్లో జి అన్నారు. మండల కేంద్రంలోని మత్య్సకార సహాకార సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా మునుగోడులో ఎన్నికల ప్రచారం చేస్తున్నా ముదిరాజ్  ఈటల రాజేందర్ దంపతుల ఎదుగుదలను ఓర్వలేకనే పల్లా రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి పాల్పడ్డం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా తెలంగాణ వ్యాప్తంగా అభిమానం సంపాదించుకొన్న ముదిరాజ్ నాయకుడ్ని రాజకీయంగా ఎదగనీయకూడదనే పథకం ప్రకారం దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మత్స్యకార కార్మికులంతా ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, అలాగే తత్తులం కూడా కాదన్నారు. మత్యకారుల అభివృద్ధికి, ఎదుగుదలకు బాసటగా నిలబడే పార్టీక మా మద్దము ఉంటుందని అన్నారు. ఆలగాని మత్వకార కుల నాయకులపై దాడులు జరిగితే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి రాజకీయంగా, సామాజకంగా సమాన అవకాశాలు ఉన్నా  కింది కులాల నాయకులకు వస్తున్న ప్రజాదరణ ను జీర్ణించుకోలేని కొందరు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు  భౌతిక దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకుల వల్ల ఆ పార్టీకే నష్టమని, అలాంటి నాయకులను అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల మత్స్యకార సహకార సంఘం మండల ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యక్షుడు బోల కృష్ణయ్య, సలహాదారుడు మిద్దె యాదయ్య, బిజినేపల్లి గ్రామ మత్స్యకార సహకార సంఘం ప్రధాన కార్యదర్శి కంపిండ్ల పర్వతాలు, వడ్డెమాన్ అధ్యక్షుడు శంకరయ్య, భీమని సాయిబాబు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు