మంగళగిరిలో లోకేశ్‌ గన విజయం


ఓడిన చోటే నిలబడి గెలిచిన యువనేత
మంగళగిరి,జూన్‌4(జనంసాక్షి) : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘన విజయం సాధించారు.
గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్‌ ఓటమి పాలయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కోవాలన్నట్టుగా ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఐదేళ్లుగా నారా లోకేష్‌ ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నారు. మంగళగిరిలో ఓటమి పాలయ్యారంటూ వైసీపీ నేతలు ఆయనను ఎన్నో విధాలుగా అవమానించారు. వాటన్నింటికీ నారా లోకేష్‌ తన విజయంతో సమాధానం చెప్పారు. తానేవిూ తన కంచుకోట నుంచి పోటీ చేయడం లేదని.. టీడీపీ వీక్‌గా ఉన్న స్థానం నుంచి పోటీ చేశానని.. తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని లోకేష్‌ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన విజయం వైసీపీకి చెంపపెట్టు అని చెప్పాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించే దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటి వరకూ విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు ఎవరెవరంటే.. రాజమండ్రి గ్రావిూణంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి… రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసు… కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు.. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు.. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు.. ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌.. ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి విజయం సాధించారు. ఇక అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి విజయం సాధించారు. నిమ్మల రామానాయుడు 69 వేల మెజార్టీతో విజయం సాధించడం విశేషం. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.