మంచినీటి పైప్ లైన్లను మరమ్మత్తు చేయిస్తున్న వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్.

వనపర్తి పట్టణంలో 30వ వార్డు సాయి నగర్, ఐజయ్య కాలనీలో రామన్ పాడు,మరియు మిషన్ భగీరథ పైపులైన్లు లింకులు కల్పకపోవడంతో ప్రజలకు నీటి కొరత ఏర్పడింది.ఈ విషయాన్ని స్థానిక ప్రజలు స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లగా,మున్సిపల్ అధికారులతో మాట్లాడి పైప్ లైన్ల మరమ్మత్తులను, చేపట్టారు. దీనితోపాటు,రాజీవ్ గృహకల్ప ఎస్సీ,ఎస్టీ హాస్టల్లో సాయినగర్ కాలనీలో 6 ఇంచుల పైప్ లైన్ లేకపోవడంతో తరచూ నీటి కొరత రావడం జరుగుతుంది. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి, పైప్ లైన్ కొత్తగా వేయాలని కోరగా స్పందించిన, అధికారులు వెంటనే పనులు ప్రారంభించారు.దీని ద్వారా భవిష్యత్తులో కూడా నీటి కొరత రాకుండా ఉంటుందని, వైస్ చైర్మన్ అన్నారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తూ, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేందర్ గౌడ్, కృష్ణయ్య,చక్రి,రాకేష్,శివాజీ, కొండన్న,మున్సిపల్ సిబ్బంది మన్యం,వసంత్,వినోద్,రాము తదితరులు పాల్గొన్నారు.