మంచి చేశా.. మళ్లీ గెలిపించండి
బీఆర్‌ఎస్ గెలుపు ప్రజలందరి గెలుపు
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధిని ప్రజలు గమనించాలి
60 ఏండ్ల పాటు వలస పాలనలో రెండు తరాల భవిష్యత్ ను నష్టపోయాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి బ్యూరో నవంబర్ 07 (జనంసాక్షి):మంచి చేశా మళ్లీ గెలిపించండని, బీఆర్‌ఎస్ గెలుపు ప్రజలందరి గెలుపు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.వనపర్తి జిల్లా భారాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు రాములు ,మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి లు హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని,60 ఏండ్ల పాటు వలస పాలనలో రెండు తరాల భవిష్యత్ ను నష్టపోయామన్నారు .ఉమ్మడి జిల్లాలోనే విలక్షణమైన తీర్పు ను వనపర్తి ప్రజలు ఇస్తారన్నారు.చేసే ప్రతి పనిని గమనిస్తూ అభివృద్ధి చేసే నాయకుడికి వనపర్తి ప్రజలు పట్టం కడతారని తెలిపారు.విూ ఆశల, ఆకాంక్షల మేరకు పని జరిగిందని అనిపిస్తే భారీ మెజారిటీతో గెలిపించండన్నారు. ప్రజలు ఆలోచించుకునే విధంగా పనులు చేసుకుంటూ పోతూ ప్రజాభిమానాన్ని పొందుతున్నాము,ఈ ఎన్నికల కు సంబంధించి ముఖ్య నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.మంత్రి నిరంజన్ రెడ్డి ,రావుల చంద్రశేఖర్ రెడ్డి లు కృష్ణ అర్జున్, ఎంపీ రాములు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల మనుషులుగా విూ ముందున్నామని, తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం వస్తుందన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రశాంతంగా ఎన్నికలు జరిగి మంత్రి నిరంజన్ రెడ్డి కి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, ఎన్నికలు ఒక యజ్ఞం, యుద్ధం లాగా కార్యకర్తలు అందరు కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ని గెలిపించాలన్నారు.గంట సేపు మాట్లాడిన ప్రసంగం లో ఎందుకు తెలంగాణ రావాలి వస్తే ఎం జరుగుతుంది అనే అంశాలపై మాట్లాడడం జరిగిందని గడిచిన 10 ఏండ్లలో జరిగిందో చూశారు కదా అని తెలిపారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఏ రోజు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగిందని, ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా ఆనందంగా ఉందని. అనుక్షణం ప్రజల అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి నిరంజన్ రెడ్డి అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాగం తిరుపతి రెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , రీజనల్ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్ విూడియా సెల్ కన్వీనర్లు నందిమల్ల శ్యాం నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డిల సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.