మంచి మనసున్న రియల్ లీడర్..!
రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 17, (జనం సాక్షి). మంత్రి నన్న గర్వం లేదు. అంతస్తులో ఎంత ఎత్తుకు ఎదిగిన ఓదిగిపోయే మనసత్వం కొందరికి ఉంటుంది. మానవవీయ దృక్పథం తో మంత్రి కేటీఆర్ మరోసారి తన ఆచరణ ద్వారా మానవీయతకు నిలువెత్తు రూపంగా నిలిచారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని సత్కరించారు. తెలంగాణ వీరుల సత్కరించేందుకు మంత్రి కేటీఆర్ వేదిక మీద నుంచి దిగి వారు వున్న చోటుకు వచ్చి శాలువ కప్పి సత్కరించారు.వింరంగా అభివాదం చేశారు. మంచి మనసున్న రియల్ లీడర్ అని మరోసారి రుజువు చేశారు.