మంటలంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయి.
అబ్దుల్లాపూర్‌మెట్: హయత్‌నగర్ మండలం మజిద్‌పూర్ గ్రామానికి చెందిన మాదగోని వెంకటయ్య గుడిసె, పక్కనే ఉన్న గడ్డివాములకు శుక్రవారం మంటలంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పని కోసం వెంకటయ్య కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూతురి వివాహం కోసం ఇంటిలో ఉంచిన రూ.1.10లక్షల నగదు, ఇతర సామగ్రి ఈ ప్రమాదంలోకాలిబూడిదయ్యాయి. దాదాపు రూ.1.50 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నాడు. విద్యుత్తు షార్టు సర్య్కూట్ వలన ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.