మంటల తెలంగాణ కావాలా? పంటల తెలంగాణ కావాలా?

 


` మత ఘర్షణలతో వందేళ్లు వెనక్కివెళ్తాం.. జాగ్రత్త!
` ప్రజాస్వామ్యాన్ని కూలుస్తున్న మోదీపై పిడికిళెత్తిపోరాడుదాం
` కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను
` ఇష్టపడి కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనది
` ఎవరో వచ్చి దీన్ని నాశనం చేస్తుంటే ఊరుకునేది లేదు
` ప్రజల అండదండలు ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా
` కేంద్రంలోని బిజెపిని సాగనంపాలి
` తెలంగాణ కీలక భూమిక పోషించాలి
` కృష్ణా జలాల వాటా తేల్చడంలో బిజెపి విఫలం
` తెలంగాణలో రైతు సంక్షేమ పథకాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌
` రంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభంలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన
రంగారెడ్డి(జనంసాక్షి): పంటలు పండే తెలంగాణ కావాలా?.. మంటలు మండే తెలంగాణ కావాలా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. మంటలు మండే తెలంగాణ అయితే తెలంగాణ దెబ్బతింటుందని కేసీఆర్‌ చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్టాన్న్రి ఆగం కానివ్వనని..అలాగే దీని అభివృద్దిని వెనక్కి వెళ్లనివ్వనని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి కష్టపడి అభివృద్ది చేసుకుంటున్నామని అన్నారు. ఈ రాష్టాన్న్రి కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తానన్నారు. నా బలగం ప్రజలే. విూ అండదండలు, ఆశీర్వచనం ఉన్నంత వరకు తనకేం కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్‌ ప్రసంగించారు. ఒక ఇల్లు కట్టాలంటే చాలా సమయం ఏర్పడుతుంది. రాష్ట్రం ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. మూఢనమ్మకాలు, పిచ్చితో, ఉన్మాదంతో వాటన్నింటిని రెండు మూడు రోజుల్లో కూలగొట్టొచ్చు. ఎంత కష్టమైతది. శిథిలమైపోతది. 58 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడం. అలా కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం కాకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బెంగళూరు సిటీ సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందింది. అక్కడి ప్రభుత్వాలు చాలా కష్టపడి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేశారు. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకుతున్నాయి. ఈ సంవత్సరం మన కంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక లక్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కానీ బెంగళూరులో ఈ ఏడాది ఏడెనిమిది వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి. అక్కడ వాతావరణాన్ని కలుషితం చేశారు. అలాంటి వాతావరణం తెలంగాణలో, హైదరాబాద్‌లో రావాలా? మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోవాలా? ఆలోచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండగా మారిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎకరం భూమి ఉన్న వ్యక్తి కూడా పెద్ద కోటీశ్వరుడు. ఈ మత పిచ్చిల పడి దాన్ని చెడగొట్టుకోవాలా ఆలోచించాలన్నారు. నీచ రాజకీయాల కోసం రాష్టాన్న్రి అల్లకల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవద్దని పరోక్షంగా బిజెపిని హెచ్చరించారు. ఓట్ల కోసం భారత సొసైటీని గోస పెట్టే పరిస్థితి తెస్తున్నారు. మోదీ ఆగంఆగం అవుతున్నారు. ఉన్న పదవి చాలాదా? అంతకన్న పెద్ద పదవి లేదు కదా..? మన తెలంగాణలో ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో ఆలోచించాలి. తెలంగాణ సమాజాం ప్రశాంతంగా ఉంది. అద్భుతమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ దుర్మార్గులు, చిల్లరగాళ్లు, మత పిచ్చిగాళ్ల మాయలో పడొద్దని కేసీఆర్‌ సూచించారు. తెలంగాణలో అద్బుతమైన రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు. తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే అధికమన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణెళినని తెలిపారు. పాత నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీరు అందించామని పేర్కొన్నారు. ఉచితంగా నీరు, కరెంట్‌ అందించామని, రైతుల బకాయిలు రద్దు చేశామని గుర్తుచేశారు. పంట కొనుగోలు చేసి బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇంత అద్బుతమైనా పాలనను తెలంగాణ అందిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలలో కూడా ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? అని ప్రశ్నించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోదీకి చేతకావడం లేదని కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉల్టా పల్టా మాట్లాడుతారు. రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలి. 100 దరఖాస్తులు ఇస్తే ఉలుకుపలుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు విత్‌ డ్రా చేసుకుంటే నీళ్లు ఇస్తామని, ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తామన్నారు కానీ స్పందన లేదన్నారు. ఏడాది అయిపోయిందని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి సాగనంపితేనే మనం అన్ని రకాలుగా బాగుపడుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా తెలంగాణ ఉద్విగ్నమైన పాత్రను పోషించాల ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో పిడికిలి ఎత్తాలి. మన రాష్ట్రం కూడా బంగారు తెలంగాణగా తయారవుతుంది. జాతీయ రాజకీయాల్లో ఉజ్వలమైన పాత్ర నిర్వహించి మతపిచ్చిగాళ్లను, రక్త పిశాచులను, అప్రజాస్వామిక పద్ధుతల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే వారికి కచ్చితంగా ఈ దేశంలో స్థానం లేదని నిరూపించేటటువంటి మహాయజ్ఞంలో తెలంగాణ భాగస్వామ్యం కావాలన్నారు. విూ అందరి అనుమతితో ఆ పనికి నేను జెండా ఎత్తుతాను అని మనవి చేస్తున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు విూ కండ్ల ముందే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు కొత్తగా చక్కటి సవిూకృత పరిపాలన భవనాన్ని నిర్మించి ప్రారంభించనందుకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగే సమయంలో రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు. భూములు ధరలు పడిపోతాయని, రాష్ట్రం వస్తే లాభం ఉండదని చెప్పారు. మనకు కరెంట్‌, మంచినీరు ఇవ్వని వారు మనల్ని గోల్‌ మాల్‌ చేసే ప్రయత్నం చేశారు. పట్టుదలతో 14 ఏండ్లు పోరాడితే చాలా త్యాగాల తర్వాత రాష్టాన్న్రి ఏర్పాటు చేసుకున్నాం. కొత్త జిల్లాలను సాధించుకున్నామని కేసీఆర్‌ తెలిపారు. విూ గ్రామాల్లో అందరితో చర్చ పెట్టాలి. ఒక్కటే ఒక్క మాట మనవి చేస్తున్నా. ఏ సమయంలో గానీ, పురాణం, చరిత్ర చదివినా.. ప్రజలను చైతన్యం చేసే మేధావులు, యువత నిద్రాణమై ఉంటారో.. వాళ్లు చాలా బాధలు అనుభవిస్తారు. మన సొంత చరిత్రనే మనకు మంచి ఉదాహరణ. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్‌ స్టేట్‌గా ఉన్నాం. ఆ తదనంతరం నాటి నాయకత్వం ఏమరుపాటుగా ఉంటే మనం ఏపీలో భాగమయ్యాం. అనేక బాధలు పడ్డాం. ఉద్యమ సమయంలో అనేక సభల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాం. ఏపీ నుంచి బయటపడేందుకు 1969లో జరిగిన ఉద్యమంలో 400 మంది పిల్లలు బలయ్యారు. మలిదశ ఉద్యమంలో అనేక మంది చనిపోయారు. అహింసా పద్ధతిలో ముందుకు పోయిప్పటికీ అనేక బాధలు అనుభవించాం. బయటపడ్డ తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు, కలుగుతున్న సదుపాయాలు విూ కండ్ల ముందే ఉన్నాయి. విూరందరూ వాటిని చూస్తున్నారు. ఇవాళ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, రైతుల పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతుబీమా సదుపాయం యావత్‌ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓ గుంట ఉన్న రైతు చనిపోయినా వారం పది రోజుల్లో రూ. 5 లక్షలు బీమా కింద జమ అవుతున్నాయి. వేరే చోట రైతులు చాలా బాధలు పడుతున్నారు. కానీ తెలంగాణ రైతులకు ఆ బాధలు లేవు. పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దళారీ వ్యవస్థకు స్వస్తి పలికాం. డబ్బులు రెండు మూడు రోజుల్లోనే జమ అవుతున్నాయి. ఆ విధంగానే రైతుబంధు డబ్బులు విూ ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుల అప్పులు చేయకుండా పంటలు పండిస్తున్నారు. 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్‌ ఇస్తున్నాం. ఈ విషయాలు కొత్తవి కావని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తాజావార్తలు