మండలంలో విస్తృతంగా పర్యటించిన పొంగులేటి.
మండలంలో పలువురికి ఆర్థిక సాయం: పొంగులేటి.
– ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ.
– దీక్ష విరమించాలని సూచించిన పొంగులేటి…
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 05 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలలో మాజీ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆయన బూర్గంపహాడ్ మండల కేంద్రం, మోరంపల్లి బంజర, లక్ష్మీపురం గ్రామాలలో పలు కార్యక్రమాల్లో హాజరై పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం బూర్గంపహాడ్ లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వరద బాధితులను, 20 రోజులుగా ప్రశాంత నాయుడు ఆధ్వర్యంలో సారపాకలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న గోదావరి వరద ముంపు బాధితుల దీక్షకు మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దీక్ష శిబిరం వద్దకు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా పొంగులేటి శీనన్న మాట్లాడుతూ గోదావరి వరద ముంపు బాధితుల సమస్యలను ఇరు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) ముఖ్యమంత్రుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముంపుకు గురైన బాధితులకు ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద ప్రకటించిన 10,000- రూపాయలు బాధితులు ప్రతి ఒక్కరికి అందుతాయని హామీ ఇచ్చారు. 20 రోజులుగా దీక్షను కొనసాగిస్తున్న ముంపు బాధితులకు దీక్ష విరమించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో ప్రశాంత నాయుడు ఆధ్వర్యంలో ముంపు బాధితుల సమస్యల వినతి పత్రం సభ్యుల సమక్షంలో ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొంగిలేటి వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బూర్గంపహాడ్ మండల మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, పొంగిలేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.