మండలి ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లోకి వచ్చింది: భన్వర్‌లాల్
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలైన సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. పట్టభద్రులైన వారు ఓటు నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 19 వరకు అవకాశం ఉందన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తామన్నారు. సాధారణ ఎన్నికల నిబంధనలే ఎమ్మెల్సీ ఎన్నికలకూ వర్తిస్తాయని, ఈ ఎన్నికల నుంచి ఓటరు జాబితాలో ఫొటోలు పెడుతున్నామని ఆయన చెప్పారు. జాబితాలో ఫొటోలు లేనివారు ఈ నెల 26 లోగా సమర్పించవచ్చన్నారు.