మండల కళాకారుల సంక్షేమ సంఘం ఆడ్ హక్ కమిటీ కన్వీనర్ గా లక్ష్మీరాజ్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల తెలంగాణ కళాకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ గా సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గుంటి లతా శ్రీ, శంకర్ ఆధ్వర్యంలో ఇట్టి ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. అనంతరం నియామక పత్రం సర్పంచ్ గుంటి లతా శ్రీ, శంకర్ వారికి అందజేశారు. ఈ సమావేశానికి కళాకారులు బిళ్ళ జగ్గయ్య ,బిల్లా వెంకట నర్సు, కనపర్తి హనుమాన్లు, గడిల రవి, శ్రీపతి జనార్ధన్, స్వర్గం రాంప్రసాద్, నక్క హనుమాన్లు ,బోయిని రాజు, వాసాల సాయి ,మామిండ్ల శ్రీనివాస్ ,సిరిపురం మహేందర్, నల్లగొండ శ్రీనివాస్, భీమనాథుని రాదమ్మ తదితరులు పాల్గొన్నారు.