మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ గూడేపు శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు గుర్తించటం , హరిత హారం చెట్లకు ప్రతి వారంలో కనీసం రెండు సార్లు నీరు పోయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పెన్షన్ వాటిని త్వరగా పరిష్కారం చేయలన్నారు. అదేవిధముగా ఐ హెచ్ హెచ్ ఎల్ పెండింగ్ పేమెంట్, ప్లానింగ్ ప్రాసెస్ లో భాగంగా నర్సరీల ఏర్పాటు , మట్టి సేకరణ , డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయుట తదితర పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శాంత కుమారి, ఎంపీఓ మౌలానా, సూపర్డెంట్ నర్సిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, ఏ పీ ఓ శైలజ, పంచాయతి కార్యదర్శులు, టిఎ, ఈ పి ఓ , ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈ పంచాయతీ ఆపరేటర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు