మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఎస్ ఎమ్ సి సమావేశం

విద్యార్థుల విద్యా ప్రమాణల కోసం కృషి చేస్తున్న హెచ్ఎం జి.రామచంద్రం.

అచ్చంపేట ఆర్ సి,19 నవంబర్2022, (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జి హరీష్ అధ్యక్షత వహించగా ప్రధానోపాధ్యాయులు జి.రామచంద్రం ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న 1 నుండి 5 వ తరగతులకు చెందిన విద్యార్థుల ద్వారా వారు చదువుకున్నటువంటి వివిధ పాఠ్యాంశాలపై వారిచే చదివించడం, వ్రాయించడం, తో పాటు వారిలోని ప్రతిభను కనబరిచే విధంగా ప్రోత్సహించారు.హెడ్మాస్టర్ జి.రామచంద్రం ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పిల్లల విద్యా ప్రమాణాల ప్రగతికి సంబంధించి తమ తమ ఇంటి వద్ద కూడా వారికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోవిద్యార్థులను బాల్య దశ నుంచే వారికి వివిధ రకాల బోధనా అంశాల పద్ధతుల ద్వారా మరియు విద్యార్థుల మనోవికాసాన్ని పెంపొందించే విధంగా విద్యాబోధన కొనసాగుతుంది తెలిపారు. హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభాపాటవాలను స్వయంగా పరిశీలించి విద్యార్థులు అన్ని పాఠాంశాలలో పురోగతిని సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు ప్రతిభాపాటలతో రాణించడం పట్ల కృషి చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అని తల్లిదండ్రులు కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ శశికళ, జానకమ్మ, కవిత, ఎన్ వెంకటరమణ, ఏ శశికళ, సాధన మరియు ఏ, నరసింహ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు