మండల వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్
బంద్ లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు,
ఖానాపురం జూన్ 18(జనం సాక్షి )
కేంద్ర ప్రభుత్వ బలగాల చేతిలో కాల్చబడ్డ అమరుడు రాకేష్ మృతికి నిరసనగా శనివారం ఖానాపురం మండల వ్యాప్తంగా బంద్ లో పాల్గొన్న టి.ఆర్.ఎస్ పార్టీ నాయకత్వం, యువకులుప్రధాని మోదీ,హోం శాఖ మినిస్టర్ అమిత్ షా,రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ దర్మార్గపు అలోచనతో కేంద్ర ప్రభుత్వ బలగాలు,ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఖానాపురం మండలంలోని దబ్బీర్ పేట యువకుడు అమరుడు దామేర రాకేష్ మృతికి నిరసనగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా టి.ఆర్.ఎస్ పార్టీ,యువకుల ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ ప్రభుత్వ,ప్రయివేటు సంస్థలు,దుకాణాలను, పెట్రోల్ బంకులను బంద్ చేయించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి అమరుడు రాకేష్ కు 2 నిమిషాలు మౌనం పాటించారు .ఈ కార్యక్రమంలో ఖానాపురం మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బుధ రావు పేట గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ మేడిద, కుమార్,గ్రామపార్టీ అధ్యక్షుడు మచ్చిక అశోక్,సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేష్,టిఆర్ఎస్వీ అధ్యక్షుడు ఎల్లబోయిన వంశీ,నాయకులు వడ్డె రాజశేఖర్, గంగాపురం రాజు,మర్రి రామస్వామి,బోడ పూలు నాయక్,తోటకూరి కుమారస్వామి,గంగాపురం అనిల్,చూడి లింగారెడ్డి,సిద్దబోయిన భరత్,యువకులు జటంగి మహేష్,మర్రి శ్రీకాంత్,పిసరి రంజిత్, తలగంపల గణేశ్, ఏడుకొండ నరేష్,గంగాపురం గణేష్, నాగరాజు, ప్రసాద్, ఎల్లయ్య,తరులు పాల్గొన్నారు.