మంత్రాలు చేస్తున్నారని దంపతులపై దాడి చేసిన స్థానికులు
హైదరాబాద్, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సంజయ్ బస్తీలో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో దంపతులపై స్థానికులు ఉదయం దాడి చేశారు. దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.