మంత్రి చెప్పిన మారని వైనం.. వసూలు యదతధం..
పైకి చెప్పలేక డబ్బులు ఇవ్వలేక సతమవుతమవుతున్న నిరుపేద లబ్ధిదారులు.
సిరిసిల్ల. అక్టోబర్ 13. (జనం సాక్షి). ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందించేందుకు శ్రీకరం చుట్టారు. సిరిసిల్లలో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరగాలని మంత్రి కేటీఆర్ తరచు చెబుతూ వచ్చారు. గతంలోనూ పలు విమర్శలు రాగా సీరియస్ గా స్పందించిన మంత్రి కేటీఆర్ వసూలు చేసిన డబ్బులు తిరిగి నిరుపేదలకు ఇవ్వాలని వసుళ్లపై సీరియస్ గా స్పందించిన విషయం తెలిసిందే. మంత్రి ఎంత గట్టిగా మందలించిన కొందరు కౌన్సిలర్లు ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. గురువారం పలువురు డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ జరిగింది. ఇదే అదనుగా తీసుకున్న కొంతమంది కౌన్సిలర్లు తమ అనుచరులను పురమాయించి పట్టాలు తీసుకున్నోళ్లు పైసలు చేతిలో పెట్టాల్సిందేనని వసూళ్లకు తెర తీశారు. ఇంటి అద్దెలు కట్టలేక సతమతమవుతున్న తాము డబ్బులు ఎక్కడి నుంచి పేరు చెప్పడానికి భయపడిన లబ్ధిదారురాలు వాపోయింది. మరో కౌన్సిలర్ అయితే ఏకంగా నగదు రూపంలో కాకుండా బంగారం రూపం లోని ఇవ్వాలంటూ డబుల్ బెడ్ రూమ్ ఇంటికి కట్నంగా వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అప్పులు చేసి మరి తులం బంగారం చొప్పున సదరు కౌన్సిలర్ కు చదివింపులు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి చెప్పడంతో ఎక్కువమంది కౌన్సిలర్లు వసుళ్ళ జోలికి పోకుండా నిజాయితీగాని వ్యవహరించారు. కొందరు మాత్రం తగ్గేదేలే అన్నట్లు యధావిధిగా తమవసుల పర్వాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కార్మిక వాడల్లో వసూళ్లపర్వం కొనసాగుతున్నట్లు పేరు చెప్పడానికి లబ్ధిదారులు భయపడుతున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి తెలిపారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ దృష్టి సారించి పేదలను కౌన్సిలర్ల వసూళ్ల వేధింపుల నుంచి కాపాడాలని రవి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను కోరారు. వసుళ్ల పర్వానికి మంత్రి కేటీఆర్ తెర దించుతారో లేదో వేచి చూడాల్సిందే.