మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి లక్ష్యంగా బిజెపి పావులు

సూర్యాపేట బరిలో దిగనున్న సంకినేని
సూర్యాపేట,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  జిల్లాలో నాలుగు స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వాలన్న యోచనతో బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో పొత్తులు, ఒంటరిగా పోటీ చేసిన సందర్భాలను అనుసరించి జిల్లాలో ఏ మండలంలో బలంగా ఉన్నాం.. ఏ నియోజకర్గంలో సత్తా చాటుతాం అన్న కోణంలో ఆపార్టీ నేతలు ముందస్తు ఎన్నికల్లో భాగంగా విశ్లేషణ చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూస్తే సూర్యాపేట నియోజకవర్గం పైనే ఆపార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని ఢీకొంటారా అన్నది అనుమానమే. ఒంటిరి పోరుతో బరిలోకి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ వ్యూహాల్లో మునిగింది. జిల్లాలోని నాలుగు స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నా.. కేవలం సూర్యాపేట స్థానం పైనే ఆపార్టీ ఆశలు పెట్టుకుంది. మిగతా మూడు స్థానాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటామని గాంభీర్‌ంయం ప్రకటిస్తోంది. అభ్యర్థులను ప్రకటించకున్నా హుజూర్‌నగర్‌లో ఆపార్టీ నిర్వహించిన సభకు కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాంను తీసుకొచ్చి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది.ఉమ్మడి జిల్లాలోనే ఇదొక్క స్థానంపై అంచనాలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకం ఇటీవల జిల్లా కేంద్రంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేందప్రధాన్‌తో ప్రారంభోత్సవం చేయించారు. ఈ సభకు బీజేపీ జన సవిూకరణ చేసి ఇతర పార్టీలకు సవాల్‌ విసిరింది. అలాగే వారం రోజుల క్రితం హుజూర్‌నగర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను ఆపార్టీ నిర్వహించి కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాంను తీసుకొచ్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాష్ట్ర నాయకత్వం సారథ్యంలో జిల్లాలో నాలుగు చోట్ల కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఎన్నికల సభలను నిర్వహించాలన్న ఆలోచనలో ఆపార్టీ ఉంది. సూర్యాపేట నుంచి ఆపార్టీ నుంచి బరిలో దిగేందుకు సంకినేని సన్నద్ధమవుతున్నారు. తనకున్న వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పార్టీ పరంగా బలంగా ఉన్నామని ఈ ఎన్నికల్లో విజయం తనదేనన్న ధీమాలో ఆయన ఉన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో తనకున్న అనుచర గణం, కేడర్‌తో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, మహాకూటమిని ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఒంటరి పోరు
కావడంతో ఈ మూడు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. కోదాడ నియోజవకర్గంలో నేతలు వందనపు సురేష్‌, బొలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, యాదా రమేష్‌లు ఎవరికి వారు తమకే టికెటన్న ఆశల పల్లకిలో ఉన్నారు. ఇక తుంగతుర్తి నుంచి రిటైర్డ్‌ మైనింగ్‌ అధికారి కడియం రామచంద్రయ్యను బరిలో దింపేందుకు ఆపార్టీ కసరత్తు చేస్తోంది.

తాజావార్తలు