మంత్రి జానారెడ్డి
చిట్యాల: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఉద్యమం సాగించటానికి ప్రత్యేక రాజకీయ పార్టీ గానీ, ప్రత్యేక ఫోరం గానీ అవసరమని తాను భావించటం లేదని రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి అన్నారు. చిట్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలకు తమ పార్టీలో చేరాలని తెరాస నుంచి ఆహ్వానం అందినట్లు పత్రికల్లో వస్తున్న కథనాలపై ఆయన స్పందిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి రాజకీయ పార్టీ నాయకత్వం కొత్త క్యాడర్‌ను ఆహ్వానించటం రాజకీయాల్లో సహజమేనన్నారు. 2014లోపు తెలంగాణ ప్రకటించే విధంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై తాము వత్తిడి పెంచుతామన్నారు. ఆయన వెంట భువనగిరి , నల్గొండ ఎంపీలు కె.రాజగోపాలరెడ్డి, జిసుఖేందర్‌రెడ్డి ఉన్నారు.