మంత్రి జోగు రామన్న నివాసం ముట్టడి


pysbpxdfఆదిలాబాద్‌: తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగురామన్న నివాసాన్ని విద్యార్థి సంఘాల నేతలు ఈరోజు ముట్టడించారు. ఆదిలాబాద్‌లోని మంత్రి నివాసానికి చేరుకున్న విద్యార్థులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి నేతలను అరెస్ట్‌ చేశారు.