మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలి
భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు21నిర్మల్ జిల్లా తానుర్ మండల కేంద్రంలో గిరిజన నాయకులు ఉద్యమకారులు మంత్రి తలసాని యాదవ్ దిష్టి బొమ్మను దహనం చేశారు అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు హైదరాబాద్ లో మంత్రి కేటిఆర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్, గిరిజన నేత,ఉమ్మడి
అదిలాబాద్ తెలంగాణ ఉద్యమ కారుడు రాజేష్ బాబు ను నెట్టేసి, చెంపదెబ్బ కొట్టడాన్ని ఉద్యమకారులు గిరిజన నాయకులు తీవ్రంగా ఖండించారు.తెలంగాణ ఉద్యమకారులకు గిరిజన సమాజానికి వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తలసాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.