మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌
వనపర్తి, జులై22(జ‌నంసాక్షి) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వనపర్తిలోని ఆమె స్వగృహానికి చేరుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆమెకు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. తారకమ్మ అంత్యక్రియలు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించడంతో, వనపర్తి కి 13 కిలోవిూటర్ల దూరంలోని పాన్‌గల్‌ మండలం కొత్తపేట శివారులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహించారు.
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌..
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాతృ మూర్తి సింగిరెడ్డి తారకమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తారకమ్మ మరణం నిరంజన్‌ రెడ్డికి తీరని లోటు అని పేర్కొన్నారు. నిరంజన్‌రెడ్డికి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.