*మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో 10 కుటుంబాలను ఆర్థిక సహాయం*
బాల్కొండ సెప్టెంబర్ 22 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని 3 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధితుల కుటుంబాలకు అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా పేద,సామాన్య,ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. అనారోగ్యంతో హసూపత్రిలో చేరిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మెరుగైన వైద్యం అందుతోందని,మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 10 మందికి లబ్ది చేకూరేలా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం మెరుగైన వైద్యం అందించేందుకు వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి సహాయ ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు,లబ్దిపొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు*
బాల్కొండ మండలంలోని 3 గ్రామాలకు చెందిన లబ్ధిదరులు
బాల్కొండ మండల మొత్తం వ్యయం రూ4,61,500 (నాలుగు లక్షల అరవై ఒక్క వేళా ఐదు వందలు) వ్యయంతో కూడిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది,ఈకార్యక్రమంలో ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య-వెంకటేష్,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్,రైతు బంధు జిల్లా సభ్యులు ఆకుల నరేందర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్,ఎంబరి నర్సయ్య,సర్పంచిలు నోముల రవి,పెంటు లింబాద్రి,ఎంపీటీసీ కన్న లింగవ్వ-పోశెట్టి,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉప సర్పంచ్లు షేక్ వాహబ్,న్యావానంది రాజేందర్,సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్,సయ్యద్ మాజారోద్దీన్,బక్కురి భూమేశ్వర్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తాకారోద్దీన్,మాజీ కో ఆప్షన్ సభ్యులు MA షాహిద్,వార్డు సభ్యులు గాండ్ల రాజేష్, సయ్యద్ రియాజ్ అలీ,తెరాస మండల నాయకులు ద్యావతి రాజు(మురళీ),ధర్మాయి రాజేందర్,దివాన్ వెంకటేష్,జంగం రాజేశ్వర్,గడ్డం రవి,ఉష్కర్ రాంచందర్,ముప్పారం రాము,పిట్ల దయాకర్,షేక్ ఆరిఫ్,నార్ల రాజు,తొగటి మురళీ,నల్ల తిరుపతి,సయ్యద్ రియజాద్దీన్,న్యావానంది నరేష్,బ్రహ్మరౌతు గోపి,తెడ్డు చక్రి,వివిధ గ్రామాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|