మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చూపిన ఆధారాలన్నీ నకిలీవి: కేజ్రీవాల్
ఢిల్లీ: కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చూపిన ఆధారాలన్ని నకిలీవని సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌పై చేసిన ఆరోపణలకు మరిన్ని రుజువులను ఆయన ఈ రోజు జంతర్‌మంతర్ వద్ద బయట పెట్టారు. ట్రస్టు పేరుతో మంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన చూపిన ఫోటోలు, పత్రాలు అన్నీ నకిలీవని కేజ్రీవాల్ తెలియజేశారు.