మంత్రి హరీష్‌ రావు ర్యాలీలో అపశృతి

బాణాసంచా కాల్చడంతో ప్రమాదం
సంగారెడ్డి,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): తెరాస ప్రచార కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి హరీశ్‌రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డిలో తెరాస కార్యకర్తలతో కలిసి హరీశ్‌రావు ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కూడలి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అయితే ద్విచక్రవాహనాలకు అతిసవిూపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు భయంతో ద్విచక్రవాహనాలు వదిలి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. బాణసంచా పొగల్లో హరీశ్‌రావు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్‌మెన్లు వచ్చి ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ప్రమాదం ఏమైనా జరుగుతుందా అన్న ఆందోళనలో మంత్రి కొద్ది సేపు అక్కడే ఉండి ఆరా తీసారు.