మంత్రి హరీష్ రావును కలిసిన మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి)వికారాబాద్
జిల్లా తాండూరు పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పలు అబివృద్ది కార్యక్రమాల ప్రారంబోత్సవానికి హాజరైన సందర్భంగా యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు శాలువాతో ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు హాజరైన మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మంత్రిని సన్మానించారు.టిఆర్ఎస్ పార్టీ సంక్షేమానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా తదితరులు ఉన్నారు.