మంత్రి హరీష్ రావు ను విమర్శించే స్థాయి ఉగ్గేల్లి రాములు కు లేదు-సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్

జహీరాబాద్,ఆగస్ట్ (జనం సాక్షి) అనునిత్యం ప్రజా సేవకై పరితపించే నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కృషి చేసి అహర్నిశలు పాటుపడుతున్న మంత్రి హరీష్ రావు ను విమర్శించే స్థాయి ఉగ్గేల్లి రాములు కు లేదు అని సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ అన్నారు. జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ బహిష్కృత అధ్యక్షులు ఉగ్గేల్లి రాములు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై అసత్య ఆరోపణలు చేయడంపై సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ…. మంత్రి హరీష్ ను విమర్శించే నైతిక హక్కు ఎంపిటిసి రాములకు లేదని, ఏం ఆర్ ఎఫ్ పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పంద విషయమై మంత్రి పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మ క్కయి కార్మికులకు అన్యాయం చేస్తున్నారనడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసత్యాలను ప్రచారం చేసుకోవడంపై తాము ఖండిస్తున్నా మని, జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ బరిలో పార్టీ అధిష్టానం, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి హరీష్ రావు ఎవరికి కేటాయిస్తే వారి విజయం కోసం తాము పని చేస్తామని, ఎమ్మెల్యే మణిక్ రావు అమాయకూడని ఆయన అమయకత్వన్ని ఆసరా చేసుకుని మంత్రి అన్ని తనై చేస్తున్నారని ఉగ్గేల్లి రాములు చెప్పడం శుద్ధ అబద్ధమని, ఏ కార్యక్రమం కూడా ఎమ్మెల్యేకు తెలియకుండా మంత్రి హరీష్ రావు చేపట్టలేదని అన్నారు.సిద్ధిపేట తర్వాత జహీరాబాద్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న మంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాగులేదని అన్నారు. మంత్రి కృషి తోనే కార్మిక నేత గా పేరు తెచ్చుకున్న మీరు మంత్రి పై విమర్శలు చేస్తారా మీరు ఎంత మీ స్థాయి ఎంత అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాజావార్తలు