మంత్రులు నోరు జారోద్దు
– వీకే సింగ్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ చురక
న్యూఢిల్లీ,అక్టోబర్23(జనంసాక్షి):
పలు అంశాలపై కేంద్రమంత్రులు వ్యాఖ్యలు చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఫరీదాబాద్ ఘటనపై కేంద్రమంత్రి వీకేసింగ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ స్పందించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యలు చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఒకసారి వ్యాఖ్యలు చేసిన తర్వాత వక్రీకరించారంటూ తప్పించుకోవడం తగదన్నారు. హర్యాణాలోని ఫరీదాబాద్‌లో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హరియాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రమంత్రి వీకే సింగ్ స్పందిస్తూ.. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణకు ప్రభుత్వాన్ని మధ్యలోకి లాగొద్దని, కుక్కలపై రాళ్లు విసిరితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్‌కు మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దళితుల చిన్నారుల హత్య, అనంతర పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. హరియాణాలో ఇద్దరు దళిత చిన్నారుల హత్యపై వీకే సింగ్ చేసిన దుమారం రేపుతున్నాయి. వీకే సింగ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నిరసన ఆందోళన చేపట్టింది. ప్రసాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన ఆప్ శ్రేణులు వీకే సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో ¬రెత్తించారు. వీకే సింగ్‌పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. దేశంలో మత అసహన ఘటనలు పెరిగిపోవడానికి మోదీ సర్కారే బాధ్యత వహించాలంటూ వెల్లువెత్తిన విమర్శలపట్ల వీకే సింగ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ప్రతి స్థానిక సమస్యకు కేంద్రం బాధ్యత వహించదని, కుక్కలపై రాయి విసిరినా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మరోపక్క, కేంద్ర మంత్రులు వీకే వీకే సింగ్, కిరణ్ రిజీజు వ్యవహారం బీజేపీలో కాక రేపుతోంది. వారి మాటలపై పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజీజు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం అధికారంలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలంటూ రాజ్ నాధ్ హితవు పలికారు.