మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదు

హైదరాబాద్‌ : ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉమ మాట్లాడుతూ… ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై సభాపతికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 9ఏళ్లయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదన్నారు.