మంథని నియోజకవర్గ అభివృద్దికి తోడ్పాటునందించాలి- మంత్రి కేటీఆర్ కీ జెడ్పీ చైర్మన్ విన్నపం

మంథని నియోజకవర్గ అభివృద్దికి తోడ్పాటునందించాలి- మంత్రి కేటీఆర్ కీ జెడ్పీ చైర్మన్ విన్నపం

జనంసాక్షి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజవకర్గంలోని పేద ప్రజల సంక్షేమంతో పాటు మంథని ప్రాంత అభివృధ్దికి తోడ్పాటునందించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ని మర్యాదపూర్వకంగా రాష్ట యువనాయకులు జక్కు రాకేష్ తో కలిసి ఆయన పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో అనేక మంది పేదలకు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, గత కాంగ్రెస్ పాలకులు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అన్యాయం చేశారని ఆయనకు గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి నిరుపేద సొంతీంటి కల నెరవేర్చాలని, నియోజకవర్గానికి అదనంగా మరో 1000 ఇండ్లు మంజూరీ చేయాలని కోరారు. అదే విధంగా గిరిజన ప్రాంతమైన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డీటీడబ్ల్యూ కార్యాలయం ఏర్పాటుతో పాటు డీటీడబ్ల్యూఓను నియమించాలని కోరారు. అదే విధంగా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన శ్రీ ఆదివరహస్వామి ఆలయ అభివృధ్దికి నిధులు కేటాయించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆయన మంత్రిని కోరారు.