మంపు బాధితులకు ఎన్టీఆర్ ఫౌండేషన్ చేయూత

మిర్యాలగూడ. జనం సాక్షి ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు సహాయం
మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆర్థిక సహాయంతో ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడమ కాలువకు గండిపడి నిడమనూరు మండల కేంద్రంలో సాయి నగర్ కాలనీవాసుల ఇళ్లలో నీరు చేరడంతో వారికి ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబానికి 20 కేజీల బియ్యం తో పాటు కుటుంబానికి వెయ్యి రూపాయలు మొత్తం 48 కుటుంబాలకు (960 కేజీల బియ్యం, 48వేల రూపాయల) ఆర్థిక సహాయం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బొల్లం జయమ్మ డి.సి.సి.బి డైరెక్టర్ విరిగినేని అంజయ్య మాజీ ఎంపీపీ చేకూరు హనుమంతరావు మాట్లాడుతూ ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేయడం ఎంతో అభినందనీయం అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం చిన్న వీరయ్య, ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి, మాజీ సర్పంచ్ బొల్లం బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు మాచర్ల దాసు, బొల్లం సైదులు, కోమటి వెంకన్న, మాజీ యూత్ మండల అధ్యక్షుడు ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, మహిళా పట్టణ అధ్యక్షురాలు రావిరాల శ్రీలత, వింజమూరు ప్రభాకర్, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ సభ్యులు చేకూరు సుధాకర్ రావు, కట్ట నరసింహ రావు, నేతాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.