మక్కా మసీదు ఇమామ్ ఇకలేరు
– ముఖ్యమంత్రులు కేసీఆర్, బాబుల ప్రగాఢ సంతాపం
మక్కామసీదు ఇమాం మృతి పట్ల సీఎం సంతాపం
హైదరాబాద్ డిసెంబర్8(జనంసాక్షి): హైదరాబాద్ మక్కా మసీదు ఇమామ్ మౌలానా హఫీజ్ ఖారి అల్హాజ్ అబ్దుల్లా ఖురేషి అల్ అజారి మరణం చెందారు.ఆయన మృతిపట్ల
తెలంగాణ ముఖ్యంత్రి ముఖ్యంత్రి సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేవ్ ముఖ్యంమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మక్కా మసీదు ఇమామ్‌గా, జామియా నిజమియా వైస్ చాన్సలర్ గా ఖురేషి సుదీర్ఘ కాలం పాటు సేవలందించారని ముఖ్యంత్రి కేసీఆర్ కొనియాడారు. మక్కామసీద్ ఇమామ్ మౌలానా హఫీజ్ కారీ అలియా మృతిపట్ల సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు హఫీజ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన మృతిచెందారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.