మట్టిని అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్.
ట్రాక్టర్ ల తో అక్రమ మట్టి దందా
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం:-(జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని తట్టి ఖానా కు వెళ్లే దారిలో అక్రమంగా ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తు ప్రభుత్వ ఆదాయానికి మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ గండి కొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని మట్టిని అమ్ముకోవాల్సి ఉండగా ధనార్జనే దెయ్యం గా పెట్టుకొని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తమ ఇష్టానుసారంగా మట్టిని విక్రయిస్తున్నారు. అధికార పార్టీ అని బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ మట్టి అక్రమాలను అరికట్టాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఎమ్మార్వో రామ్ మోహన్ ను వివరణ కోరగా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ట్రాక్టర్లతో మట్టి అక్రమంగా తరలిస్తున్న విషయం నా దృష్టికి వచ్చిందని ట్రాక్టర్లతో మట్టి కొట్టే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.