మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

వినాయక నవరాత్రులను ఆనందంగా జరుపుకోవాలి

* మేయర్ సునీల్ రావు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
గణేష్ నవరాత్రి ఉత్సవాలను నగర ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. వినాయక చతుర్థి సందర్భంగా కరీంనగర్ లోని టవర్ సర్కిల్లో బుధవారం రోజు జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పలువురికి 100 మట్టి వివాయకులను పంపిణీ చేశారు. అనంతరం ఫొటో విడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు మేయర్ సునీల్ రావు ను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ నగర ప్రజలు మట్టి గణపతిని మనసారా పూజించి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. నగరవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని డివిజన్లో వారిగా వాడవాడలో వెలసిన గణనాధులను ఘనంగా పూజించి ఆయురారోగ్యాలు ప్రసాదించేలా స్వామి వారిని వేడుకోవాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజించడం కన్న మట్టి గణపతులను పూజించడం మిన్న అని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయకులను రాబోయే రోజుల్లో ప్రజలు పూర్తి స్థాయి లో నివారించి. మట్టి తో తయారు చేసిన వినాయకులను పూజించాలని మట్టి వినాయక పూజ మహా పుణ్యం అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు శ్రీ సిరి రవి, ప్రధాన కార్యదర్శి, తుమ్మ చందు, ఉపాధ్యక్షులు, ఫోకస్ శ్రీను, ఎమ్ బి స్టూడియో శంకరాచారి, ఉప్పల మధు, శ్రీనాథ్, వోల్లాల మధు, నిషాని శంకర్, లేఖ అనిల్, మిట్ట రాము, చంద్రగిరి వేణు, పట్టెం రాజు, బాలు, ప్రవీణ్, రాజేష్, రమేష్, ఇటిక్యాల రాజేందర్, టప్ప రవి, అనిల్, ప్రశాంత్, తదితర ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.