మట్టి గణపతి పకృతి హితమే పండుగ పరమార్ధం

(జనంసాక్షి) జూలై 15
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు మట్టి వినాయకులను పూజించాలని అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పించిన అల్వాల్ మున్సిపల్ సూపరిండెంట్ హరిబాబు శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుచ్చయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టిలోంచే సకల ప్రాణుల సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. అది ఒక కారణమైన మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడం వల్ల అందరూ తమకు తెలియకుండానే తలో చేయి వేసి చెరువులో పూడిక తీసినట్లు అవుతుంది. చెరువులను బాగు చేసినట్లు అవుతుంది. ఇది ఓ కారణమైన అసలు వినాయకుడు పుట్టింది పార్వతి దేవి మేని నాలుగు మట్టి నుంచే కదా అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకుని పూజించాలి అప్పుడే భక్తి ముక్తి శక్తి అలాగే మట్టి వినాయకుని పూజించడం అంటే మన ప్రకృతి పూజించడంతో సమానం మనకు జీవాన్ని జీవితాన్ని మనుగడనిస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయక చవితి ద్వారా లభిస్తుంది. అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుని మట్టి వినాయకుడిని పూజించాలి. వినాయకుని పండుగ అంటేనే ప్రకృతి తో ముడిపడి ఉంటుంది. వినాయక చవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగాని పత్రిగాని ప్రకృతికి ప్రతిరూపాలే అదేవిధంగా మట్టి వినాయకుని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతను నిర్వర్తించినట్లు అవుతుంది. వినాయకుడి బొమ్మలను మట్టితోనే చేయాలని శాస్త్రం చెపుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు అది విష పదార్థం తోనే సమానం మనకు అన్ని ఇస్తున్న మట్టిని పూజించడం మానేసి విష పదార్థం పూజించడం ఎంతవరకు సమాజం అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసే నీళ్లు పూర్తిగా కలుషితమైపోతాయి. మట్టి వినాయకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్న ఉండదు.
అందువల్ల మట్టి వినాయకుని పూజించడం మనకి మంచిది. పర్యావరణానికి మంచిది. పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా తనను మట్టితో చేసే వారిని ఇష్టపడతాడు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది మహేందర్, కౌసర్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area