మట్టి నమూనాల సేకరణ

నల్గొండ,మార్చి3(జ‌నంసాక్షి):  మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల అభివృద్ధిలో భాగంగా నడిగూడెం, కాగిత రామచంద్రాపురం, కరివిరాల చెరువులలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి నమూనాలు సేకరించారు. భూసార పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తామని ఏవో జానిమియా తెలిపారు. నడిగూడెంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచి నూనె ఇందిర, ఏఈవో నరేశ్‌, నాగన్న, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే పేద, మధ్య తరగతి, మైనార్టీ వర్గాలకు చెందిన వధువుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దారు జె.కార్తీక్‌ అన్నారు. నడిగూడెం మండలం రత్నవరంలో మంగళవారం తహసీల్దారు ఈ పథకాన్ని ప్రారంభించారు. రూ.51వేల చెక్కును లబ్దిదారు లక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి విజయవర్థన్‌రెడ్డి, ఉప సర్పంచి వీరబాబు, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు