మట్టి పాత్రల నూతన ఆవిష్కరణలకు వెన్నంటే ఉంటా
– కుండల తయారీ పరిశ్రమకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తా
– కుండల తయారీ నూతన యంత్రాల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి*
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 20 జనంసాక్షి:
మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుమ్మరులు మనుగడ కొనసాగింపుగా చేపట్టే మట్టి పాత్రల తయారి కోసం వెన్నంటే ఉంటూ ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
గురువారం నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో నాగర్ కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని కుమ్మరులు కుండల తయారీ యంత్రాల పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ….
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం కులవృత్తులు ఎంతగానో దోహదపడుతున్నాయని, వారిని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే కుండల తయారీ కోసం అవసరమయ్యే యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుండి 80% సబ్సిడీ ద్వారా అందిస్తుందన్నారు. మరిన్ని కొత్త ఆవిష్కరణలతో కుండలు తయారుచేయడం వల్ల కుల వృత్తుదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అందుకు తాను ఎప్పుడు అండగా ఉంటానన్నారు. కుమ్మరులంతా కమిటీగా ఏర్పడి కుండల తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందించి అందివ్వాలని దానికి అవసరమయ్యే అన్ని వనరులు సమకూరుస్తానన్నారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ మాట్లాడుతూ…
గతంలో రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుండి రామానంద తీర్థ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లాలో ని నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి ముగ్గురు అచ్చంపేట నియోజకవర్గం నుండి నలుగురు కొల్లాపూర్ నియోజక వర్గం నుండి ఇద్దరు శిక్షణకు హాజరైన హాజరైన 9 మందికి రాష్ట్ర ప్రభుత్వం 80% సబ్సిడీతో ఆధునిక యంత్రాలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుండి అందించడం జరుగుతుందన్నారు.
రానున్న రోజుల్లో మరింత మందికి శిక్షణను అందించి యంత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమయ్య మున్సిపల్ కమిటీ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్, ఎంపీపీ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు, కుమ్మర శాలివాహన సంఘం పాలమూరు జిల్లా అధ్యక్షులు బుగ్గన్న, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రఘుబాబు ఉపాధ్యక్షులు సుల్తాన్, జంగయ్య, మాస్టర్ ట్రైనర్లు డాన్, ఊరుకొండ సుమలత, సింగిల్ విండో డైరెక్టర్లు అనంతయ్య తిరుపతయ్య, లోకేష్, రవి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|