మట్టి ప్రతిమలను పూజించండి..

– బల్దియా మేయర్  గుండు సుధారాణి
-మట్టి విగ్రహాలను అందజేసిన మేయర్,కమీషనర్
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 27(జనం సాక్షి)
  పర్యావరణ హితం కోసం మట్టి ప్రతిమలను పూజించాలని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అన్నారు.శనివారం ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్, కమీషనర్ ప్రావీణ్య లు పాల్గొని  మట్టి వినాయక విగ్రహాలను ఆర్.పి.లు బల్దియా సిబ్బందికి  ప్రధానం చేశారు.
        అనంతరం  ఏర్పాటుచేసిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతోందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం నగర ప్రజలకు ఆదర్శం గా నిలవడానికి బల్దియా తరపున ఆర్.పి.లు, ఉద్యోగులు, సిబ్బంది కి మట్టి విగ్రహాలను అందజేయడం జరిగిందని,నగర ప్రజలు పర్యావరణ స్ఫూర్తిని కొనసాగిస్తూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్ లలో మట్టి వినాయక ప్రతిమలను  అందజేయడం జరుగుతుందని తెలిపారు.
  ఈ సందర్భంగా మేయర్,కమీషనర్ లు సంయుక్తంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.
   ఇట్టి కార్యక్రమంలో  సెక్రటరీ విజయలక్ష్మి,
సి.ఎం.హెచ్.ఓ.డా.జ్ఞానేశ్వర్,ఎం..హెచ్.ఓ.డా.రాజేష్,,వెటర్నరీ డాక్టర్ గోపాల్ రావు  తదితరులు పాల్గొన్నారు.