మణుగూరు పట్టణంలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

పినపాక నియోజకవర్గం ఆగష్టు 10 (జనం సాక్షి): భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం మణుగూరు పట్టణంలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ను సి ఐ ముత్యం.రమేష్, ఎస్సై రాజ్ కుమార్ ప్రారంభించారు. ప్రదర్శన అనంతరం వారు మాట్లాడుతూ   వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకలను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించాలని అన్నారు.మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నుంచి సురక్ష బస్టాండ్ వరకు  ఎక్స్లెంట్ , శ్రీవిద్య , మాంటిస్సోరి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల చే ప్రదర్శన నిర్వహించారు. భారత స్వాతంత్ర్య విలువలు ఇప్పటి తరానికి తెలియాలని సీఎం కేసీఆర్ 15 రోజులపాటు జెండా పండుగలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని 75 ఏండ్ల భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు.ఈనెల 21 వరకు ప్రతి ఏరియా సినిమా ధియేటర్లో గాంధీ సినిమా ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనకు యువతతో పాటు విద్యార్థులు కూడా చూడాలన్నారు. ప్రతి ఇంటిలో గ్రామాల్లో పట్టణాల్లో వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.