మతం కులం పేరుతో చేస్తున్న రాజకీయాలను తిప్పి కొట్టాలి.
ఆత్మీయయువ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్.
సైనికుల్ల పనిచేయాలని యువతకు పిలుపు.
ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 27. (జనంసాక్షి). మతం కులం పేరుతో చేస్తున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తిప్పి కొట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణం లోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ యువ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుంటే ప్రజల్లో చీలిక తేవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన చేసింది ఏమీ లేదని అన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి ప్రజలపై భారం మోగుతున్న విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించవలసిన బాధ్యత యువత తీసుకోవాలని అన్నారు. రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో ఆదరించారని రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కెసిఆర్ మంత్రి పదవి ఇవ్వడంతో తెలంగాణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు యువకులు సైనికుల్లా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జింథం చక్రపాణి, పలువురు యువజన విభాగం నాయకులు బిఆర్ఎస్ నాయకులు పట్టణంలోని వార్డులో నుండి కౌన్సిలర్లు యువకులు పాల్గొన్నారు.