మత్స్యకారులకు అండగా తెరాస ప్రభుత్వం

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే సతీష్ కుమార్
మృత్యుకారుల దినోత్సవ సందర్భంగా. ర్యాలీ
కొల్లాపూర్ వేడుకలు ఘనంగా నిర్వహించి బైకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కొల్లాపూర్ లో సభకు మత్స్యకారులు భారీగా తరలి వచ్చారు
మత్స్యకారులకు అండగా తెరాస ప్రభుత్వం!
సింగోటంలో ఇంటిగ్రేటెడ్ చేపల మార్కెట్ ఏర్పాటు!
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి ! బీసీ కమిషన్, ప్రభుత్వం దృష్టికి మత్స్యకారుల సమస్యలు!
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి వెల్లడి
 రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు తెరాస ప్రభుత్వం అండగా ఉందని కొల్లాపూర్ ఎమ్మెల్యేభీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. సోమవారం కొల్లాపూర్ పట్టణంలోని రాజా బంగ్లా ముందు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెనుగుల్ల సాంప్రదాయ మత్స్యకారుల సంఘం తాలూకా అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. త్వరలో సింగోటం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. గత 30 సంవత్సరాలుగా మత్స్యకారుల సమస్య బీసీ డీ గ్రూపు నుండి బిసి గ్రూపుకు మార్చేందకు బీసీ కమిషన్, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మత్స్యకారులకు వలలు, చేప పిల్లలు, వాహనాలు ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలిపారు. మత్స్యకారులు దళారుల చేతుల్లో పడి మోసపోవద్దని ఆయన సూచించారు. నియోజకవర్గంలో  చేపల వేటకు వెళ్లి చెరువులో ప్రమాదవశాస్తూ పడి మృతి చెందిన 24 మందికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పగడాల శ్రీనివాసులు, డా మల్లికార్జున్ అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ సింగోటం రామన్న నివాళి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశానుసారం బీసీ కమిషన్ బిసి డి నుండి బీసీ ఏ కు మార్చి మత్స్యకారుల బ్రతుకులు మార్చాలన్నారు. అంతకుముందు తెలుగు సాంప్రదాయ మస్యకారుల సంఘం మత్స్యకారులు ఏర్పాటుచేసిన జెండాను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు సభావత్త్ భోజ్యా నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్, సాంప్రదాయ మత్స్యకారుల నాయకులు చిన్న రాములు గట్టు ఆంజనేయులు సత్య శివుడు విజయుడు మధు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు