మత్స్య కారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
పెన్ పహాడ్. నవంబర్ 11 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని ఎంపీపీ నేమ్మాది బిక్షం, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య అన్నారు శుక్రవారం మండల పరిధిలోని గాజుల మల్కాపురం సమ్మక్క సారక్క దేవాలయం వద్ద మత్యశాఖ ఆధ్వర్యంలో మత్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తోందని అందులో భాగంగానే యాదవులకు గొర్రెలను యూనిట్లను , ముదిరాజ్ వారికి చేప పిల్లలను, ఎస్సీలకు దళిత బంధు పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాగా మండలంలోని గాజుల మల్కాపురం,చీదేళ్ల, సింగారెడ్డి పాలెం,మాచారం, దూపహాడ్,మహమ్మదపురం,పెన్ పహాడ్,ధర్మపురం గ్రామాల్లోని 32 చెర్వులు, కుంటలకు 6 .50లక్షల చేప పిల్లలను మొదటి విడతలో పంపిణీ చేస్తున్నట్లు మాత్యశాఖ అధికారి సుమలత తెలిపారు ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి యుగేందర్,నాయకులు మామిడి అంజయ్య,బండి రామ కృష్ణారెడ్డి రెడ్డి,బొల్లాక బొబ్బయ్య,తూముల ఇంద్రసేనారావు, భూక్య సైదా,రామచంద్రారెడ్డి, వరకాల అంజయ్య ,రహమాన్,పిల్డ్మెన్ మల్లికార్జున్, ఫిషర్ మేన్ సతీష్,సీవో రోజారత్న తదితరులు పాల్గొన్నారు.