మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య సంరక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు
తుమ్మల అలోజి
బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య  సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మత్స్య సహకార సంఘం  మండల అధ్యక్షులు తుమ్మల అలోజి ప్రభుత్వాన్ని కోరారు మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు ముదిరాజ్లకు దక్కాలంటే బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని మండల మత్స్యకార సహాకార సంఘం అధ్యకుడు తుమ్మల ఆల్లోజీ డిమాండ్ చేశాడు. మండల కేంద్రంలోని మత్స్యకార సహకార సంఘం భవనంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. నవంబరు 21 ప్రపంచ మత్స్య సంపద, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పల్లె పల్లెలో ముదిరాజ్ జెండా. ఎగరవేసి చైతన్యం నింపాలని సభ్యులకు తెలిపారు. అన్ని జిల్లాలో ఫిషరీస్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ఫెడరేషన్ ఎ న్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.  ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.3 వేల నిధులు కేటాయించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.. రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టి, ఆదాయాన్ని మత్స్యకారులకు పంచాలని కోరారు. కార్యక్రవ లంలో మండల మత్స్యకార సహకార సంఘం ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యకులు బాల కృష్ణయ్య, సొప్పరి బాలస్వామి, ఇరుబంద శ్రీనివాసులు, శంకరయ్య, అంజనేయులు ఉన్నారు.

తాజావార్తలు