మద్దతుదారులతో నేడు యడ్యూరప్ప భేటీ
బెంగళూరు: భాజపాను వీడి కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన మద్దతుదారులతో భేటీ అవుతున్నారు. బెంగళూరులోని డాలర్ కాలనీ నివాసంలో విందు భేటీకి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ఆహ్వానం పంపారు. మరో వైపు యడ్యూరప్పను బుజ్జిగించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది, పార్టీలోనే కొనసాగాలని పలువురు నేతలు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు.