మద్దెలబండ లో పౌర హక్కుల దినోత్సవం
మల్దకల్ ఆగస్టు 30 (జనంసాక్షి) మండల పరిధిలోని మద్దెలబండ గ్రామంలో మంగళవారం రైతు వేదిక లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జయమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ కుల వివక్షత లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జీవించాలని సమాజంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనలేని కృషి చేశారని ప్రతి గ్రామంలో ప్రతినెల పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ గ్రామాలలో కుల వివక్ష పాటించకుండా కలిసి మెలసి ఉండాలన్నారు.ఎవరైనా గ్రామాలలో అంటరానితనము ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మారెప్ప టిఆర్ఎస్ నాయకుడు నారాయణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మిగతా శాఖ అధికారులు గైరాజరయ్యారు.
\
